ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ28, అక్టోబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

వర్షపు నీటి నిల్వలకు చెక్‌.. డ్రైనేజీల ప్రక్షాళన!

78వ డివిజన్‌లో తుఫాన్ నేపథ్యంలో ముందస్తు చర్యలు... వడ్డెర కాలనీ, పీ అండ్ టీ కాలనీల్లో డ్రైనేజీల శుభ్రత... కార్పొరేటర్ అభ్యర్థి పిరియా జగదాంబ ఆధ్వర్యంలో పనులు...

V10TV న్యూస్ డెస్క్ 28 అక్టోబర్, 2026 10:04 AMకి 4,867 వీక్షణలు
వర్షపు నీటి నిల్వలకు చెక్‌.. డ్రైనేజీల ప్రక్షాళన! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 28 : అర్నాబ్ తుఫాన్ ప్రభావంతో గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో 78వ డివిజన్‌లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీల శుభ్రత పనులు చేపట్టారు. ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు బుధవారం ఉదయం 7 గంటల నుంచి ఎన్డీఏ కూటమి కార్పొరేటర్ అభ్యర్థి పిరియా జగదాంబ ఆధ్వర్యంలో వడ్డెర కాలనీ, పీ అండ్ టీ కాలనీల్లో ప్రత్యేక చర్యలు చేపట్టారు. విజయవాడ నగరపాలక సంస్థ సిబ్బందితో కలిసి ఆయా ప్రాంతాల్లో పర్యటించిన పిరియా జగదాంబ డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న వ్యర్థాలను తొలగించే పనులను పర్యవేక్షించారు. వర్షపు నీరు సజావుగా వెళ్లేలా కాలువలను శుభ్రం చేయించారు. నివాస ప్రాంతాల్లో నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్‌చార్జి పిరియా సోమేశ్వరరావు, క్లస్టర్ ఇన్‌చార్జి సుర్విపల్లి అమర్‌నాథ్ గౌడ్, నలమాటి కామేశ్వరరావు, బూత్ ఇన్‌చార్జిలు శ్రీపాద యాదగిరి, షేక్ బాజీ, మొహమ్మద్ గౌస్, లోకేష్, పెదపూడి మాధవరావు, నాంచారయ్య, పిరియా వెంకట్, కాకి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

తుఫాన్ వర్షాల్లోనూ రోడ్లపైనే ట్రాఫిక్ పోలీసులు!

24 నిమిషాల క్రితం 0

తుఫాన్ ముప్పు.. కొండ ప్రాంతాల్లో పోలీసుల అప్రమత్తం!

28 నిమిషాల క్రితం 4,173

తుఫాన్ వేళ రంగంలోకి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము!

35 నిమిషాల క్రితం 4,264

తీరం దాటకముందే 'అర్నాబ్' విధ్వంసం!

43 నిమిషాల క్రితం 3,272