ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ21, అక్టోబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

విజయవాడ ఉత్సవ్‌కు ఘన ముగింపు

పది రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలతో సందడిగా విజయవాడ… 9,500 ఆన్‌లైన్ దరఖాస్తులతో వివిధ విభాగాల్లో పోటీలు… ముఖ్యమంత్రి ప్రోత్సాహంతోనే ఉత్సవాలను ఘనంగా నిర్వహించగలిగామన్న నిర్వాహకులు…

V10TV న్యూస్ డెస్క్ 21 అక్టోబర్, 2026 10:12 AMకి 4,873 వీక్షణలు
విజయవాడ ఉత్సవ్‌కు ఘన ముగింపు — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 21: విజయవాడ ఉత్సవ్‌ 2.0 ముగింపు వేడుకలు మంగళవారం రాత్రి ఘనంగా జరిగాయి. ఉత్సవాల ముగింపులో భాగంగా నిర్వహించిన భారీ కార్నివాల్‌ వాక్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, వెనిగండ్ల రాము తదితరులు ఘన స్వాగతం పలికారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా పది రోజులపాటు నిర్వహించిన విజయవాడ ఉత్సవ్‌ ప్రజలను విశేషంగా ఆకట్టుకుందని నిర్వాహకులు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలు, ప్రోత్సాహంతోనే ఈ ఏడాది ఉత్సవాలను మరింత విస్తృతంగా నిర్వహించగలిగామని పేర్కొన్నారు. సాంస్కృతిక కళాకారులకు వేదికగా, ప్రజల భాగస్వామ్యంతో ఉత్సవాలు జరగాలన్న ముఖ్యమంత్రి సూచనలను అమలు చేసినట్లు వివరించారు. వివిధ పోటీల కోసం 9,500 ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించి, ప్రతిభావంతులకు అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. విజయవాడ ఉత్సవ్‌కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధితోపాటు విజయవాడకు ప్రత్యేక గుర్తింపు వస్తోందన్నారు. ఉత్సవాల విజయవంతానికి సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజయవాడ ప్రజల తరఫున నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

పశ్చిమంలో బీసీలకే పెద్దపీట!

13 నిమిషాల క్రితం 2,872

బుద్ధా హామీతో చల్లారిన అసమ్మతి సెగలు!

18 నిమిషాల క్రితం 1,989

పశ్చిమ వైసీపీ అభ్యర్థులకు బీ ఫారాల పంపిణీ

14 గంటల క్రితం 3,290

85వ డివిజన్‌లో బొండా ఉమా ఇంటింటి ప్రచారం

17 గంటల క్రితం 3,590