ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

గాంధీజీ ఆశయాలకు తూట్లు పొడుస్తున్న కూటమి ప్రభుత్వం: వెలంపల్లి

గాంధీ పథకాల పేర్లను తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపణ… రెడ్‌బుక్‌ రాజ్యాంగం పేరిట హింసాత్మక రాజకీయాలు సాగుతున్నాయని విమర్శ… గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి…

V10TV న్యూస్ డెస్క్ 2 అక్టోబర్, 2026 12:52 PMకి 3,957 వీక్షణలు
గాంధీజీ ఆశయాలకు తూట్లు పొడుస్తున్న కూటమి ప్రభుత్వం: వెలంపల్లి — చిత్రం 1
గాంధీజీ ఆశయాలకు తూట్లు పొడుస్తున్న కూటమి ప్రభుత్వం: వెలంపల్లి — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 2: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ ఆలోచనలు, ఆశయాలకు తూట్లు పొడుస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం సమీపంలోని త్రిమూర్తి చౌక్‌లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పారిశుధ్య కార్మికులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ.. అహింసా మార్గంలో పోరాడి దేశానికి స్వాతంత్ర్యం సాధించిపెట్టిన మహనీయుడు గాంధీజీ అని కొనియాడారు. అహింసతో ఏదైనా సాధించవచ్చని ప్రపంచానికి చాటిచెప్పిన ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2019 నుంచి 2024 మధ్య పాలనలో గ్రామ, వార్డు సచివాలయాల

గాంధీజీ ఆశయాలకు తూట్లు పొడుస్తున్న కూటమి ప్రభుత్వం: వెలంపల్లి — అదనపు చిత్రం 2

ద్వారా సాకారం చేశారని పేర్కొన్నారు. పరిపాలనను వికేంద్రీకరించి గ్రామస్థాయిలోనే ప్రజలకు పౌరసేవలు అందించడంతోపాటు శాంతిభద్రతలను పకడ్బందీగా పరిరక్షించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గాంధీజీ పేరుతో ఉన్న సంక్షేమ పథకాలను సైతం తొలగించేలా కుట్రలు చేస్తోందని ఆరోపించారు. మహనీయుల ఆనవాళ్లు లేకుండా చేసేందుకు ప్రయత్నించడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో అహింసకు బదులుగా హింసాత్మక రాజకీయాలు, ‘రెడ్‌బుక్‌ రాజ్యాంగం’ పేరిట అరాచక పాలన కొనసాగుతోందని విమర్శించారు. ఎన్నికల్లో ఓట్ల కోసం గాంధీజీ పేరును ఉపయోగించడం కాదని, ఆయన సిద్ధాంతాలను చిత్తశుద్ధితో అమలు చేసే నాయకులకే ప్రజల ఆశీస్సులు ఉంటాయని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ ఎల్లప్పుడూ గాంధేయ మార్గంలో నడుస్తూ ఆయన ఆశయాల సాధనకు కట్టుబడి ఉంటుందని వెలంపల్లి పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

డిసెంబర్‌ నుంచి ధరల మోత?

21 నిమిషాల క్రితం 3,897

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

2 గంటల క్రితం 3,494

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

2 గంటల క్రితం 3,784

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

2 గంటల క్రితం 4,901