చిన్నారుల చిరునవ్వులతో సందడిగా బాలల దినోత్సవం!
విద్యార్థులు కష్టపడి చదివి పాఠశాలకు పేరు తేవాలి... మంచి విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు... 84వ డివిజన్ కార్పొరేటర్ లబ్బ దుర్గా...

పాయకాపురం, నవంబర్ 14: విద్యార్థులు క్రమశిక్షణతో కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని 84వ డివిజన్ కార్పొరేటర్ లబ్బ దుర్గా పిలుపునిచ్చారు. శనివారం 84వ డివిజన్ పరిధిలోని ఎస్జీ కిడ్స్ స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నూతన కార్పొరేటర్ లబ్బ దుర్గా, వైకుంఠం దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు కార్పొరేటర్‌ను ఘనంగా సన్మానించారు. అనంతరం లబ్బ దుర్గా మాట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు మంచి విలువలను అలవర్చుకొని సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యా సంవత్సరంలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడుతున్న తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మీరాజ్య పూర్ణ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అజిత్‌సింగ్‌నగర్‌లోని ఎం.కె. బేగ్ పాఠశాలలోనూ బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

