ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ12, నవంబర్ 2026, గురువారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

శాంతినగర్‌లో వైభవంగా అయ్యప్ప పడిపూజ

భక్తిశ్రద్ధలతో దీక్షా మాలధారణ మహోత్సవం… ప్రత్యేక పూజలు, భజనలతో మార్మోగిన శాంతినగర్… మోడల్ డైరీ 26వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమం…

V10TV న్యూస్ డెస్క్ 12 నవంబర్, 2026 6:04 PMకి 7,516 వీక్షణలు
శాంతినగర్‌లో వైభవంగా అయ్యప్ప పడిపూజ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

పాయకాపురం, నవంబర్ 12 : విజయవాడ పాయకాపురంలోని శాంతినగర్‌లో శ్రీ అయ్యప్ప స్వామి దీక్షా మాలధారణ మహోత్సవం, పడిపూజ కార్యక్రమాన్ని బుధవారం భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. పేరం కృష్ణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో శ్రీ దత్తాత్రేయ స్వామి భక్త బృందం ఆలపించిన భక్తిగీతాలు, భజనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సతీష్ గురుస్వామి, హరి గురుస్వామి, అప్పారావు గురుస్వామి తదితరుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామివారి పడిపూజను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకుడు, ఆహ్వానకర్త పి. కృష్ణమూర్తి మాట్లాడుతూ మోడల్ డైరీ 26వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అయ్యప్ప స్వామివారి పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. మోడల్ డైరీ అధినేత ధన్ ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారని వివరించారు. అయ్యప్ప స్వామివారి ఆశీస్సులు అందరికీ కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి గురుస్వాములు, అయ్యప్ప దీక్షాధారులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణతో శాంతినగర్ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

ఆదిత్య యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య

1 గంట క్రితం 5,797

ఐదేళ్లుగా ఆగని అన్నదాన సేవ!

1 గంట క్రితం 8,566

ఏపీకి రూ.80 వేల కోట్ల భారీ పెట్టుబడులు!

2 గంటల క్రితం 7,528

క్లీన్ సిటీ ఘనతపై కమిషనర్‌కు ఏఐటీయూసీ అభినందనలు

2 గంటల క్రితం 8,447