కూలిన రక్షణ గోడ.. వీధినపడ్డ నాలుగు కుటుంబాలు
బయటకు వెళ్లిన చిన్నారులు.. తప్పిన పెను ప్రాణనష్టం నాలుగు ఇళ్లు ధ్వంసం.. నిరాశ్రయులైన 15 మంది తక్షణ సాయం, పునరావాసం కల్పించాలని బాధితుల వేడుకోలు


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, సెప్టెంబర్ 13: జగ్గిపిళ్ల రామారావు వీధిలో రక్షణ గోడ కూలడంతో నాలుగు కుటుంబాలకు చెందిన ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆయా కుటుంబాలకు చెందిన సుమారు 15 మంది చిన్నారులు ఘటన సమయంలో బయట ఆడుకోవడానికి వెళ్లడంతో పెను ప్రాణనష్టం తప్పింది. పిల్లలు ఇళ్లలోనే ఉండి ఉంటే పరిస్థితి ఊహించలేనంత విషాదకరంగా మారేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇళ్లు కోల్పోయిన బాధిత కుటుంబాలు తీవ్ర ఆవేదనతో రోడ్డున పడినప్పటికీ

అధికారులు, ప్రజాప్రతినిధులు తగిన స్థాయిలో స్పందించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. విషయం తెలుసుకున్న అద్దూరి తమ్మారావు బాధిత కుటుంబాలను పరామర్శించి, దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని, సమస్యను ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణ సహాయం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బాధితులకు వెంటనే ఆర్థిక సహాయంతోపాటు సురక్షిత పునరావాసం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

