ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

వినతులకు పరిష్కారం పట్టాలకు భరోసా

ప్రజాదర్బార్‌లో సమస్యలు విన్న ప్రభుత్వ విప్ బొండా ఉమా ఆరు వేల మందికి పైగా పింఛన్ల కోసం నమోదు జీవో 30తో పేదలకు శాశ్వత ఇంటి హక్కు

V10TV న్యూస్ డెస్క్ 25 సెప్టెంబర్, 2026 5:26 PMకి 3,653 వీక్షణలు
వినతులకు పరిష్కారం పట్టాలకు భరోసా — చిత్రం 1
వినతులకు పరిష్కారం పట్టాలకు భరోసా — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ బ్యూరో, సెప్టెంబర్ 25 : ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటికి సత్వర పరిష్కారం చూపడమే ప్రజాప్రతినిధిగా తన ప్రధాన బాధ్యతని ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. సింగ్‌నగర్‌లోని తన కార్యాలయంలో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ప్రజాదర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. వారి వ్యక్తిగత, స్థానిక సమస్యలను సావధానంగా విని వివరాలు తెలుసుకున్నారు. ప్రతి వినతిని పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. అర్హత, నిబంధనల మేరకు సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఆరు వేల మందికి పైగా వితంతు, దివ్యాంగ, వృద్ధాప్య పింఛన్ల కోసం తమ కార్యాలయంలో నమోదు చేసుకున్నారని బొండా ఉమా తెలిపారు. ప్రతి లబ్ధిదారుడి ఇంటి వద్ద క్షేత్రస్థాయి పరిశీలన చేయించి అర్హులకు పింఛన్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకున్నట్లు

వినతులకు పరిష్కారం పట్టాలకు భరోసా — అదనపు చిత్రం 2

చెప్పారు. పేదలకు పట్టాభిషేకం దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఇంటి పట్టాల సమస్యకు జీవో నంబరు 30 ద్వారా శాశ్వత పరిష్కారం చూపుతున్నామని బొండా ఉమా తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు నివాస స్థలాలపై శాశ్వత యాజమాన్య హక్కులు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 30న సెంట్రల్ నియోజకవర్గంలో పది వేల మందికి ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్లు చేపట్టి పట్టాలు అందజేయనున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గంలో కమ్యూనిటీ హాళ్లు, రహదారులు, తాగునీటి ట్యాంకులతోపాటు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాసరి ఉదయశ్రీ, దేవరపు మాల్యాద్రి, బేవర నారాయణ, బుదాల సురేష్, గౌసియా, చిట్టితల్లి, సరోజిని తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

డిసెంబర్‌ నుంచి ధరల మోత?

19 నిమిషాల క్రితం 3,897

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

2 గంటల క్రితం 3,494

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

2 గంటల క్రితం 3,784

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

2 గంటల క్రితం 4,901