అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన కేంద్రం మార్పు
సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నుంచి కానూరు సీఐడీ కార్యాలయానికి తరలింపు… నేటి నుంచి ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బాండ్ల పరిశీలన… రెడ్డిగూడెం మండలానికి చెందిన బాండ్లను మాత్రమే నేడు పరిశీలించనున్న అధికారులు…

విజయవాడ, అక్టోబర్ 10: అగ్రిగోల్డ్ బాధితుల ఒరిజినల్ బాండ్ల పరిశీలన కేంద్రాన్ని విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నుంచి కానూరులోని ప్రాంతీయ సీఐడీ కార్యాలయానికి మార్చారు. అక్టోబర్ 10 నుంచి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బాండ్ల పరిశీలన నిర్వహించనున్నారు. అగ్రిగోల్డ్ బాధితులు, డిపాజిటర్లు, ఏజెంట్లు తమ ఒరిజినల్ బాండ్లతో కానూరు తులసీనగర్‌లోని సీఐడీ కార్యాలయానికి వెళ్లాలని పోలీసులు సూచించారు. శనివారం రెడ్డిగూడెం మండలానికి సంబంధించిన బాండ్లను మాత్రమే పరిశీలించనున్నట్లు తెలిపారు. కేంద్రం మార్పును బాధితులు గమనించి, అనవసర ఇబ్బందులు పడకుండా నేరుగా కానూరు సీఐడీ కార్యాలయానికి వెళ్లాలని సూచించారు.
