ఇన్స్టాలో యాడ్ చూసి.. రూ.1.30 లక్షలు పోగొట్టుకున్న యువతి
▪️ భారీ లాభాల పేరుతో ఇన్స్టాగ్రామ్ ప్రకటనకు ఆకర్షితురాలు... ▪️ పెట్టుబడి తిరిగి ఇవ్వాలంటే మరింత డబ్బు చెల్లించాలని ఒత్తిడి... ▪️ మోసపోయానని గ్రహించి విజయవాడ పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు...

విజయవాడ: సోషల్ మీడియాలో పెట్టుబడుల పేరుతో జరుగుతున్న మోసాలకు మరో యువతి బలైంది. భారీ లాభాలు వస్తాయంటూ ఇన్స్టాగ్రామ్లో కనిపించిన ప్రకటనను నమ్మిన విజయవాడకు చెందిన యువతి సుమారు రూ.1.30 లక్షలు పోగొట్టుకుంది. సైబర్ మోసగాళ్లు విడతల వారీగా నగదు జమ చేయించడంతో పాటు, పెట్టిన పెట్టుబడిని తిరిగి పొందాలంటే మరింత డబ్బు చెల్లించాలని ఒత్తిడి చేసినట్లు సమాచారం. తాను మోసపోయానని గుర్తించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

