యువకుల మధ్య వివాదం.. బైక్ దగ్ధం
విజయవాడ భవానీపురం ప్రియదర్శిని కాలనీలో ఘటన... మద్యం మత్తులో యువకుల మధ్య గొడవ జరిగినట్లు సమాచారం... బైక్కు నిప్పంటించిన ఘటనపై వివరాలు సేకరిస్తున్న భవానీపురం పోలీసులు...

విజయవాడ: భవానీపురం ప్రియదర్శిని కాలనీలో ఇద్దరు యువకుల మధ్య జరిగిన వివాదం ఓ ద్విచక్ర వాహనం దగ్ధమయ్యే వరకు వెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు మరో యువకుడితో వివాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆగ్రహంతో ద్విచక్ర వాహనానికి నిప్పంటించినట్లు సమాచారం. మంటల్లో బైక్ తీవ్రంగా దెబ్బతింది.
ఘటనపై సమాచారం అందుకున్న భవానీపురం పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. వివాదానికి అసలు కారణం ఏమిటి, వాహనానికి నిప్పంటించిన పరిస్థితులు ఏమిటనే అంశాలపై ఆరా తీస్తున్నారు.
ఘటనకు సంబంధించి ఇరువురు యువకులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు సమాచారం. పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

