72, 81వ డివిజన్లలో ఎన్డీఏ కూటమి ప్రచార హోరు
కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా విస్తృత ప్రచారం… ప్రజలతో మమేకమైన టీడీపీ యువ నాయకుడు బొండా సిద్ధార్థ… పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని పిలుపు…

విజయవాడ, అక్టోబర్ 30: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 72, 81వ డివిజన్లలో శుక్రవారం ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగింది. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు బొండా సిద్ధార్థ కూటమి అభ్యర్థులకు మద్దతుగా స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు 72వ డివిజన్‌లోని లోటస్ మెయిన్ గేట్ సమీపంలో ఉన్న సుబ్బరాజు విగ్రహం వద్ద నుంచి ప్రచారం ప్రారంభించారు. అనంతరం 81వ డివిజన్ ప్రశాంతినగర్‌లోని పార్టీ కార్యాలయం వద్ద నుంచి నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలను కలుసుకుంటూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా బొండా సిద్ధార్థ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ప్రతి కార్యకర్త చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ప్రజలతో మమేకమవుతూ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు.నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రతి డివిజన్‌లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాల్లో యువత, పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొంటున్నాయని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ఎన్డీఏ కూటమి అభిమానులు పాల్గొన్నారు.

