కీలక అంశాలపై గవర్నర్‌తో జగన్ చర్చ
సాయంత్రం ఐదు గంటలకు గవర్నర్‌తో భేటీ క్యాంపు కార్యాలయం వద్ద ఘటనపై ఫిర్యాదు మెగా డీఎస్సీ ఆరోపణలపై సీబీఐ విచారణకు వినతి

విజయవాడ, సెప్టెంబర్ 23: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం విజయవాడకు రానున్నారు. సాయంత్రం ఐదు గంటలకు గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్‌ను కలిసి పలు అంశాలపై వినతిపత్రం సమర్పించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. విజయవాడలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఇటీవల జరిగిన ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నాయి. మెగా డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని జగన్ కోరనున్నట్లు వైసీపీ వెల్లడించింది.

