ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

విజయవాడ ఉత్సవ్‌కు జాతీయ ఖ్యాతి!

కృష్ణమ్మ తీరాన కళలు, సంస్కృతి, సంప్రదాయాల సందడి.. ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి కమలేష్ పాస్వాన్‌, ఎంపీలు శ్రీకృష్ణదేవరాయలు, కేశినేని చిన్ని.. మహిళా సాధికారతకు వేదికగా జాతీయ సరస్ మేళా.. ప్రజల పండుగగా విజయవాడ ఉత్సవ్‌–2.0..

V10TV న్యూస్ డెస్క్ 14 అక్టోబర్, 2026 10:42 PMకి 3,899 వీక్షణలు
విజయవాడ ఉత్సవ్‌కు జాతీయ ఖ్యాతి! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 14: కృష్ణమ్మ తీరాన విజయవాడ సాంస్కృతిక వైభవం వెల్లివిరుస్తోంది. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా పున్నమి ఘాట్ వేదికగా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్‌–2.0 నగర కళలు, సంస్కృతి, సంప్రదాయాలను దేశవ్యాప్తంగా పరిచయం చేసే వేదికగా నిలుస్తోందని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. బుధవారం ఉత్సవాల్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాస్వాన్‌, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, కేశినేని శివనాథ్‌ (చిన్ని) పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కమలేష్ పాస్వాన్ మాట్లాడుతూ విజయవాడలో దసరా వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా దేశంలోని విభిన్న ప్రాంతాల కళలు, సంస్కృతులకు గుర్తింపు తీసుకురావడంలో ఇటువంటి ఉత్సవాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. అన్ని వయసుల ప్రజలు ఉత్సాహంగా పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ విజయవాడ ఉత్సవాలను అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించడం అభినందనీయమన్నారు. దసరా ఉత్సవాలకు జాతీయ స్థాయిలో మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేస్తున్నారని తెలిపారు. జాతీయ సరస్ మేళా ద్వారా వివిధ రాష్ట్రాల మహిళా స్వయం సహాయక సంఘాలకు తమ ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించుకునే అవకాశం లభిస్తోందన్నారు. ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ జాతీయ సరస్ మేళా నిర్వహణకు సహకరించిన కేంద్ర మంత్రి కమలేష్ పాస్వాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేళా ద్వారా డ్వాక్రా మహిళలకు, గ్రామీణ స్వయం సహాయక సంఘాలకు విస్తృత మార్కెట్ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో సొసైటీ ఫర్ వైబ్రంట్ విజయవాడ సహకారంతో ఉత్సవాలు కొనసాగుతున్నాయని చెప్పారు. విజయవాడ ఉత్సవ్ కేవలం నిర్వాహకుల కార్యక్రమం కాదని, నగర ప్రజలందరూ కలిసి జరుపుకొనే ప్రజా పండుగ అని చిన్ని అభివర్ణించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహకారంతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, బొండా సిద్ధార్థ, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, సొసైటీ ఫర్ వైబ్రంట్ విజయవాడ ప్రతినిధి ముత్తవరపు మురళి, సినీ నటులు మురళీమోహన్, రాజా రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

డిసెంబర్‌ నుంచి ధరల మోత?

20 నిమిషాల క్రితం 3,897

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

2 గంటల క్రితం 3,494

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

2 గంటల క్రితం 3,784

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

2 గంటల క్రితం 4,901