80వ డివిజన్లో టీడీపీ అభ్యర్థి బెవర సూర్యమణికి మద్దతుగా ఎన్నికల ప్రచారం
ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసిన కూటమి నాయకులు... సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి... మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణకు మద్దతుగా ప్రచారం...

పాయకాపురం, అక్టోబర్ 27 : విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో సెంట్రల్ నియోజకవర్గంలోని 80వ డివిజన్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి బెవర సూర్యమణికి మద్దతుగా మంగళవారం విస్తృతంగా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు డివిజన్ పరిధిలోని పలు పోలింగ్ బూత్‌లలో కూటమి నాయకులు ఓటర్లను కలుసుకుని ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ అభ్యర్థి బెవర సూర్యమణి స్థానిక ప్రజలను కలుసుకుని తనకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఎన్డీఏ కూటమి మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణకు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయాలని కోరారు. డివిజన్ అభివృద్ధికి, స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులు బెవర నారాయణ, సూర్య, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. బెవర సూర్యమణి, వంగవీటి రాధాకృష్ణకు మద్దతుగా ఓటర్లను కలుసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

