ఆర్టీసీ బస్సులో సీఎం చంద్రబాబు.. మహిళలతో ఆత్మీయ సంభాషణ
ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలను అడిగి తెలుసుకున్న సీఎం అమరావతి పరేడ్ గ్రౌండ్స్ నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు వరకు బస్సులో ప్రయాణం విజయనగరం నుంచి విశాఖకు నెలకు రూ.4 వేల వరకు ఆదా అవుతోందన్న మహిళ

ఆగస్టు 15 – V10TV AP: మహిళలకు అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుతీరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా తెలుసుకున్నారు. అమరావతిలోని పరేడ్ గ్రౌండ్స్ నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా క్యాంపు కార్యాలయం వరకు ఆర్టీసీ బస్సులో మహిళలతో కలిసి ప్రయాణించారు. ప్రయాణ సమయంలో మహిళలతో మాట్లాడిన సీఎం.. ఉచిత ప్రయాణం వల్ల కలుగుతున్న ప్రయోజనాలు, బస్సు సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విజయనగరం నుంచి విశాఖకు ప్రతిరోజూ ప్రయాణించే ఓ మహిళ ఉచిత బస్సు పథకంతో నెలకు సుమారు రూ.4 వేల వరకు ఆదా అవుతోందని సీఎంకు వివరించారు.

