గాంధీజీ ఆశయాల సాకారానికి కృషి చేద్దాం: నారా లోకేశ్
శాంతి, సహనం, సత్యమార్గంలో పయనించాలి… సమానత్వం, గ్రామ స్వరాజ్యం, స్వావలంబన సాధించాలి… గాంధీజీ సేవలను స్మరించుకుంటూ ఘన నివాళి…

అమరావతి, అక్టోబరు 2: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఘన నివాళులర్పించారు. దేశ స్వేచ్ఛా స్వాతంత్య్రం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ధన్యజీవి బాపూజీ అని కొనియాడారు. గాంధీజీ చూపిన శాంతి, సహనం, సత్యమార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని పిలుపునిచ్చారు. మహాత్ముడు కలలుగన్న సమానత్వం, గ్రామ స్వరాజ్యం, స్వావలంబన, స్వచ్ఛతను సాధించాలని కోరారు. ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడమే నిజమైన నివాళి అని నారా లోకేశ్ పేర్కొన్నారు.

