హెల్మెట్తోనే ప్రాణాలకు రక్షణ
హెల్మెట్ ధరించని వాహన చోదకులకు పోలీసుల కౌన్సెలింగ్… ప్రమాదాల తీవ్రత, ప్రాణనష్టంపై అవగాహన కల్పించిన సీఐ లక్ష్మీనారాయణ… ప్రతి ప్రయాణంలోనూ భద్రతా నిబంధనలు పాటించాలని సూచన…


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, అక్టోబర్ 3: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సత్యనారాయణపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ సూచించారు. శనివారం సత్యనారాయణపురం పోలీస్స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్న వాహన చోదకులకు ఆయన కౌన్సెలింగ్ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ లేకపోవడం వల్ల తలకు తీవ్ర గాయాలై ప్రాణాలు కోల్పోయే ప్రమాదం అధికంగా ఉంటుందని వివరించారు. కొద్దిదూరమే కదా

అనే నిర్లక్ష్యం, అతివేగం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగులుస్తాయని హెచ్చరించారు. ద్విచక్ర వాహనం నడిపేవారితోపాటు వెనుక కూర్చున్నవారు కూడా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపవద్దని, సెల్ఫోన్ మాట్లాడుతూ ప్రయాణించవద్దని, నిర్ణీత వేగంతోనే వాహనాలు నడపాలని చెప్పారు. జరిమానాలకు భయపడి కాకుండా ప్రాణరక్షణ కోసమే హెల్మెట్ ధరించాలని సీఐ లక్ష్మీనారాయణ వాహన చోదకులకు విజ్ఞప్తి చేశారు.

