ఓటు హక్కు తొలగించారన్న ప్రకాశ్ రాజ్.. బీజేపీ కౌంటర్
ఎస్ఐఆర్లో తన ఓటు తొలగించారని నటుడు ప్రకాశ్ రాజ్ ఆరోపణ... బీఎల్ఓ వెరిఫికేషన్ సమయంలో చిరునామాలో అందుబాటులో లేరన్న బీజేపీ... నాలుగేళ్లుగా ఆ అడ్రస్‌లో నివాసం లేరని కౌంటర్...

ఎస్ఐఆర్ ప్రక్రియలో తన ఓటును తొలగించారని నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన ఆరోపణలపై బీజేపీ కౌంటర్ ఇచ్చింది. బీఎల్ఓ వెరిఫికేషన్ సమయంలో ఆయన సంబంధిత చిరునామాలో అందుబాటులో లేరని పేర్కొంది.
ఓటరు జాబితాలో ఉన్న చిరునామాలో ప్రకాశ్ రాజ్ నాలుగేళ్లుగా నివాసం ఉండటం లేదని, వివరాల్లో మార్పులు ఉంటే ఫామ్-6 ద్వారా అప్డేట్ చేసుకోవచ్చని అధికారులు సూచించినట్లు బీజేపీ పేర్కొంది.
మరోవైపు పబ్లిక్ ఫిగర్స్, ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులకు సంబంధించిన ఓటరు వివరాల విషయంలో ఎన్నికల సంఘం అధికారులు ముందుగా పూర్తి స్థాయిలో పరిశీలించాల్సిన అవసరం లేదా? అంటూ ప్రకాశ్ రాజ్ ప్రశ్నించినట్లు సమాచారం. తన నివాసం వద్ద బీఎల్ఓలు మాట్లాడిన వీడియోను కూడా ఆయన షేర్ చేసినట్లు తెలుస్తోంది.

