చింతకోళ్లకు ట్యాంకర్‌తో తాగునీరు
ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచనతో సరఫరా... ఉదయం 4 వేల లీటర్లు.. సాయంత్రం మరో 4 వేల లీటర్లు... వారం రోజులుగా క్రమం తప్పకుండా కొనసాగుతున్న సేవ...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
కోడూరు: కోడూరు మండల పరిధిలోని చింతకోళ్ల గ్రామ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు వాటర్ ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా కొనసాగుతోంది. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచన మేరకు కోడూరు టౌన్ జనసేన పార్టీ అధ్యక్షుడు కోట రాంబాబు ఆధ్వర్యంలో గ్రామానికి తాగునీరు అందిస్తున్నారు.
గురువారం ఉదయం ట్యాంకర్ ద్వారా 4 వేల లీటర్ల తాగునీటిని గ్రామానికి సరఫరా చేశారు. సాయంత్రం మరో 4 వేల లీటర్ల నీటిని అందించనున్నట్లు రాంబాబు తెలిపారు.

గ్రామంలో తాగునీటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ సూచనల మేరకు గత వారం రోజులుగా క్రమం తప్పకుండా ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామ ప్రజలకు ఇబ్బంది లేకుండా అవసరమైన మేరకు తాగునీటి సరఫరాను కొనసాగిస్తామని తెలిపారు.

