దుర్గమ్మ సేవలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న దేవాదాయశాఖ మంత్రి… మంత్రికి వేదాశీర్వచనం అందించిన వేదపండితులు… అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేసిన ఆలయ ఈవో…

విజయవాడ, నవంబర్ 12 : రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గురువారం ఉదయం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్శనానంతరం ఆలయ వేదపండితులు మంత్రికి వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనానాయక్ మంత్రికి శ్రీ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు.

