ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ25, అక్టోబర్ 2026, ఆదివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

తెలంగాణ ఐపాస్ పోర్టల్‌పై సైబర్ దాడి!

22వ తేదీ రాత్రి నుంచి నిలిచిపోయిన సేవలు.. డేటాబేస్‌ను ఎన్‌క్రిప్ట్ చేసిన హ్యాకర్లు… ఫైళ్లకు కొత్త ఎక్స్‌టెన్షన్.. సర్వర్‌లో అనుమానాస్పద రాన్సమ్ నోట్… పారిశ్రామిక అనుమతులకు అంతరాయం.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో…

V10TV న్యూస్ డెస్క్ 25 అక్టోబర్, 2026 2:17 PMకి 3,565 వీక్షణలు
తెలంగాణ ఐపాస్ పోర్టల్‌పై సైబర్ దాడి! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

హైదరాబాద్, అక్టోబర్ 25: తెలంగాణ ప్రభుత్వానికి చెందిన కీలకమైన టీజీ ఐపాస్ పోర్టల్‌పై సైబర్ దాడి జరగడం కలకలం రేపింది. పరిశ్రమల స్థాపన, వ్యాపార అనుమతుల కోసం ఉపయోగించే ఈ పోర్టల్ అక్టోబర్ 22వ తేదీ రాత్రి 11.36 గంటల నుంచి పనిచేయడం నిలిచిపోయింది. సర్వర్‌ను పరిశీలించిన సాంకేతిక నిపుణులు డేటాబేస్‌తో పాటు సంబంధిత ఫైళ్లు ఎన్‌క్రిప్ట్ అయినట్లు గుర్తించారు. ఫైళ్ల పేర్లకు '.vgb' అనే కొత్త ఎక్స్‌టెన్షన్ జోడించడంతో పాటు హ్యాకర్లు సంప్రదింపుల కోసం ఈమెయిల్ చిరునామాతో కూడిన రాన్సమ్ నోట్‌ను ఉంచినట్లు వెల్లడైంది. ఈ ఘటనతో ప్రభుత్వ పారిశ్రామిక అనుమతుల ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ సంగా సురేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్లు 43, 66 కింద కేసు నమోదు చేశారు. హ్యాకర్లు కీలక సమాచారాన్ని చోరీ చేశారా? డేటా బయటకు తరలించారా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. డేటా బ్యాకప్ అందుబాటులో ఉందని, సోమవారం ఉదయానికి పోర్టల్ సేవలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపడుతున్నామని పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వ డిజిటల్ వ్యవస్థల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో ఈ సైబర్ దాడికి బాధ్యులెవరన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

‘జై భవానీ’ నామస్మరణతో మార్మోగిన ఇంద్రకీలాద్రి!

3 నిమిషాల క్రితం 3,407

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డీసీపీ గుణ్ణం రామకృష్ణ

1 గంట క్రితం 3,792

అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న సీఐ లక్ష్మీనారాయణ

3 గంటల క్రితం 4,872

భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఘోర ప్రమాదం!

3 గంటల క్రితం 2,257