ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ12, సెప్టెంబర్ 2026, శనివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

చిన్న వర్షానికే పశ్చిమం జలమయం

లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వర్షపు నీరు ప్రియదర్శిని కాలనీ, కుండల బజార్‌లో వెలంపల్లి పర్యటన ముంపు నివారణ చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని విమర్శ

V10TV న్యూస్ డెస్క్ 12 సెప్టెంబర్, 2026 3:38 PMకి 1,698 వీక్షణలు
చిన్న వర్షానికే పశ్చిమం జలమయం — చిత్రం 1
చిన్న వర్షానికే పశ్చిమం జలమయం — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, సెప్టెంబర్ 12 (ఆంధ్రప్రభ): విజయవాడ నగరంలో కురిసిన వర్షానికి పశ్చిమ నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 42వ డివిజన్‌ పరిధిలోని ప్రియదర్శిని కాలనీ రోడ్డు, కుండల బజార్‌ తదితర ప్రాంతాలను మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు శనివారం పరిశీలించారు. మోకాళ్ల లోతు నీటిలో నడుస్తూ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ కాలువలు, డ్రైన్లలో ముందస్తుగా పూడికతీత పనులు చేపట్టకపోవడంతో చిన్నపాటి వర్షానికే రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని

చిన్న వర్షానికే పశ్చిమం జలమయం — అదనపు చిత్రం 2

విమర్శించారు. మురుగునీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు అనారోగ్యం బారినపడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించిందని ఆరోపించారు. కాలనీల్లో నిలిచిన నీటిని మోటార్ల ద్వారా వెంటనే తొలగించాలని నగరపాలక సంస్థ అధికారులను ఫోన్‌లో కోరారు. డ్రైన్లు, కాలువల్లో పూడికతీత చేపట్టి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేశారు. అధికారులు నిర్లక్ష్యం వీడకపోతే ప్రజలతో కలిసి ఆందోళనలు చేపడతామని వెలంపల్లి హెచ్చరించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

టిడ్కోను ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దుతాం

54 నిమిషాల క్రితం 1,998

‘వాటర్ మ్యాన్ కాదు.. బటర్ మ్యాన్’

1 గంట క్రితం 2,893

వినాయకుడి పేరుతో వసూళ్ల దందా..?

4 గంటల క్రితం 1,845

క్వాంటం బయో వ్యాలీకి కేంద్రం చేయూత

5 గంటల క్రితం 2,863