వికసిత్ భారత్ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
పశ్చిమ నియోజకవర్గంలో ‘సేవా జ్యోతి యాత్ర’ బైక్ ర్యాలీ… కేబీఎన్ కళాశాల నుంచి భవానీపురం సంకల్ప సభ వరకు… సభకు హాజరైన మంత్రి సత్యకుమార్ యాదవ్, బుద్ధా వెంకన్న…


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, అక్టోబరు 7: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ సాధనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి బుద్ధా వెంకన్న పిలుపునిచ్చారు. మోదీ ప్రజాసేవ ప్రస్థానం 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ‘సేవా జ్యోతి యాత్ర’లో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బైక్ ర్యాలీ

నిర్వహించారు. కేబీఎన్ కళాశాల వద్ద ప్రారంభమైన ర్యాలీ భవానీపురంలో నిర్వహించిన ‘వికసిత్ భారత్ సంకల్ప సభ’కు చేరుకుంది. సభకు హాజరైన మంత్రి సత్యకుమార్ యాదవ్, బుద్ధా వెంకన్న మాట్లాడుతూ దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, సేవా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే యాత్ర ప్రధాన లక్ష్యమని తెలిపారు. ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

