క్రెడిట్ కార్డు లిమిట్ పెంపు పేరుతో సైబర్ మోసం
మాచవరానికి చెందిన వ్యక్తి ఫోన్‌కు నకిలీ బ్యాంకు లింక్ ఏపీకే ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేయగానే కార్డు వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి క్రెడిట్ కార్డు నుంచి రూ.73 వేలు, రూ.40 వేలు డెబిట్.. పోలీసులకు బాధితుడి ఫిర్యాదు

విజయవాడ: క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామంటూ సైబర్ నేరగాళ్లు మాచవరానికి చెందిన ఓ వ్యక్తిని మోసం చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు పేరుతో వచ్చిన లింక్‌ను నమ్మిన బాధితుడు, అందులోని ఏపీకే ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేసి వివరాలు నమోదు చేశాడు. అనంతరం అతని క్రెడిట్ కార్డు నుంచి రూ.73 వేలు, రూ.40 వేలు చొప్పున మొత్తం రూ.1.13 లక్షలు డెబిట్ అయినట్లు గుర్తించాడు. వెంటనే కార్డును బ్లాక్ చేయించి మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

