ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ13, ఆగస్టు 2026, గురువారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

ప్రజా సమస్యలు పట్టని పాలకుల బుద్ధి మారాలి: సీపీఐ

కేంద్రంలోని ప్రజా వ్యతిరేక పాలనకు చరమగీతం పాడాలని దోనేపూడి శంకర్ పిలుపు... విజయవాడ సమగ్రాభివృద్ధికి రూ.50 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్... పాతబస్తీలో డ్రైనేజీ, ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి...

V10TV న్యూస్ డెస్క్ 13 ఆగస్టు, 2026 11:08 AMకి 3,251 వీక్షణలు
ప్రజా సమస్యలు పట్టని పాలకుల బుద్ధి మారాలి: సీపీఐ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయని, ప్రజా సమస్యలను పట్టించుకోని పాలకుల వైఖరి మారాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార పాదయాత్ర ఏడో రోజు బుధవారం పాతబస్తీ కొత్తపేటలో కొనసాగింది. నగర కార్యదర్శివర్గ సభ్యుడు కొట్టు రమణారావు అధ్యక్షతన కొత్తపేట నెహ్రూ బొమ్మ సెంటర్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర సంరంగం చౌక్ వరకు సాగింది.

ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. ఉద్యోగాల కల్పన, నల్లధనం వెనక్కి తీసుకురావడం, నిత్యావసర ధరల నియంత్రణ వంటి అంశాల్లో కేంద్రం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదని ఆరోపించారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎస్ఐఆర్ పేరుతో ఓటర్ల విషయంలో అనుసరిస్తున్న విధానాలపైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన, నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సహాయం వంటి ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్య, వైద్యం వంటి కీలక రంగాల్లో ప్రైవేటీకరణ విధానాలను విరమించుకోవాలని కోరారు. ఆరోగ్యశ్రీ వంటి పథకాలను మరింత సమర్థంగా అమలు చేసి పేదలకు వైద్య సేవలు అందుబాటులో ఉంచాలన్నారు.

రాజరాజేశ్వరిపేటలో మౌలిక వసతుల కల్పనకు గతంలో కమ్యూనిస్టు ప్రజాప్రతినిధులు చేసిన కృషి కీలకమని పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న రైల్వే స్థలాల సమస్యకు ఇప్పటికీ పరిష్కారం లభించలేదని, ప్రభుత్వం రైల్వే శాఖ అధికారులతో చర్చించి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.

సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ విజయవాడ నగర సమగ్రాభివృద్ధికి రూ.50 వేల కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. నగరంలో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి అవసరమైన ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, సబ్‌వేలు, అండర్‌పాస్‌లు ఏర్పాటు చేయాలని కోరారు.

ఇళ్లు లేని అర్హులైన పేదలకు రెండు సెంట్ల స్థలం కేటాయించి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. చిన్నపాటి వర్షానికే జలమయమవుతున్న పాతబస్తీలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని, జెండా చెట్టు ప్రాంతంలోని అవుట్‌ఫాల్ డ్రైనేజీని అభివృద్ధి చేసి వర్షపు నీరు నిలవకుండా చర్యలు చేపట్టాలని కోరారు.

ప్రధాన రహదారుల వెంట ఆక్రమణలను తొలగించి ట్రాఫిక్ సజావుగా సాగేలా చూడాలని, విద్యాసంస్థలకు సమీపంలోని కూడళ్ల వద్ద మద్యం దుకాణాల కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీపీఐ పోరాటాలను కొనసాగిస్తుందని నేతలు పేర్కొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

నిరుపేద దంపతులకు జీవనోపాధిగా తోపుడు బండి

9 నిమిషాల క్రితం 1

గుడివాడ ఏఎల్‌సీ పాఠశాలలో అంగన్‌వాడీ కార్యకర్తలకు జ్ఞానజ్యోతి శిక్షణ

12 నిమిషాల క్రితం 2

గుడివాడలో రూ.26.52 కోట్లతో విద్యుత్ అభివృద్ధి పనులు

42 నిమిషాల క్రితం 1,563

మంత్రి నియోజకవర్గంలో తాగునీటి కటకట

50 నిమిషాల క్రితం 1,125