ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ20, అక్టోబర్ 2026, మంగళవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

73వ డివిజన్‌లో కూటమి గెలుపే లక్ష్యం!

న్యూ రాజరాజేశ్వరి పేటలో ఇంటింటా బొండా రవితేజ ప్రచారం… అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రధాన లక్ష్యమని వెల్లడి… రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం…

V10TV న్యూస్ డెస్క్ 19 అక్టోబర్, 2026 11:05 PMకి 4,089 వీక్షణలు
73వ డివిజన్‌లో కూటమి గెలుపే లక్ష్యం! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 19: విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో 73వ డివిజన్‌లో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. సోమవారం సాయంత్రం న్యూ రాజరాజేశ్వరి పేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నుంచి ప్రారంభమైన ప్రచార కార్యక్రమంలో టీడీపీ యువ నాయకుడు బొండా రవితేజ పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు. కూటమి అభ్యర్థికి మద్దతుగా ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా బొండా రవితేజ మాట్లాడుతూ నగర సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ఎన్డీఏ కూటమి ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. నగరంలోని ప్రతి డివిజన్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామన్నారు. ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల సమష్టి కృషితో నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్డీఏ కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

81వ డివిజన్‌లో టీడీపీకి కొత్త బలం

58 నిమిషాల క్రితం 3,897

77వ డివిజన్‌లో జోరుగా కూటమి ప్రచారం

4 గంటల క్రితం 2,902

గుడ్లవల్లేరులో వైసీపీకి బిగ్‌ షాక్‌!

4 గంటల క్రితం 2,755

39వ డివిజన్‌లో జోరుగా ఇంటింటి ప్రచారం

5 గంటల క్రితం 3,891