గుడ్లవల్లేరు మండలంలో ఎమ్మెల్యే రాము విస్తృత ఎన్నికల ప్రచారం
కూటమి అభ్యర్థులకు మద్దతుగా డోకిపర్రులో పర్యటన... గ్లాసు, సైకిల్ గుర్తులకు ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి... కూటమి విజయంతో గ్రామాల అభివృద్ధికి బాటలు పడతాయన్న ఎమ్మెల్యే రాము...

గుడ్లవల్లేరు, అక్టోబర్ 27 : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గుడివాడ నియోజకవర్గ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రెండో రోజు మంగళవారం సాయంత్రం గుడ్లవల్లేరు మండలంలోని డోకిపర్రు గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. డోకిపర్రు 1, 2 ఎంపీటీసీ సెగ్మెంట్లతో పాటు పెసరమిల్లి, కూరాడ పరిధిలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఓటర్లను కలిశారు. ఆయా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా జనసేన జడ్పీటీసీ అభ్యర్థి వర్రె బలరామకృష్ణ, ఎంపీటీసీ అభ్యర్థులు పాగోలు కళ్యాణి, కళ్యాణపు నవాబులకు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయాలని కోరారు. అదేవిధంగా టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులు రాజులపాటి వెంకటలక్ష్మి, తెల్లాకుల నాగలక్ష్మికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తే గ్రామాల అభివృద్ధికి మరింత అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. గ్రామస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేసే నాయకత్వం అవసరమన్నారు. కూటమి పార్టీల మధ్య సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, గుడివాడ జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, మండల టీడీపీ అధ్యక్షుడు పోలవరపు వెంకటరావు, మార్కెట్ యార్డు చైర్మన్ పొట్లూరి రవి, శ్రీ కొండలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ ఈడే మోహన్, టీడీపీ నాయకులు సూరపనేని పరంధామయ్య, కొడాలి రామరాజు, అట్లూరి ప్రసాద్, చేకూరి జగన్మోహన్రావు, వల్లభనేని వెంకటరావు, వల్లభనేని సుబ్బారావు, పామర్తి సత్తిబాబు, దుగ్గిరాల శేషుబాబు, మల్లిపెద్ది సుబ్రమణ్యం, అబ్దుల్ సత్తార్, వెనిగళ్ల నాగేశ్వరరావు, పిచ్చేశ్వరరావు, శివప్రసాద్, తూము పద్మజ, జనసేన నాయకులు తోట చిన్నారి, కుప్పినేని శశివేణి, అడపా బాబి, బీజేపీ నాయకులు లింగం చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

