టీటీడీకి కోడెల కుటుంబం రూ.20 లక్షల విరాళం
శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి ఆర్థిక సాయం... కోడెల గౌతం రూ.10 లక్షలు.. కోడెల జేయాదిత్య రూ.10 లక్షల విరాళం... మాజీ స్పీకర్ డా. కోడెల శివప్రసాద్ ఆశయాలకు అనుగుణంగా సేవా కార్యక్రమానికి చేయూత...

వీ10టీవీ తిరుమల, ఆగస్టు 14: పేదలకు వైద్య సేవలు అందిస్తున్న టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి నవ్యాంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ డా. కోడెల శివప్రసాద్ కుటుంబం తరఫున రూ.20 లక్షల విరాళం అందించారు.
డా. కోడెల శివప్రసాద్ ఆశయాలకు అనుగుణంగా ఆయన మనవళ్లు కోడెల గౌతం రూ.10 లక్షలు, కోడెల జేయాదిత్య రూ.10 లక్షలు చొప్పున మొత్తం రూ.20 లక్షలను విరాళంగా అందించినట్లు టీటీడీ తెలిపింది.
ఈ విరాళానికి సంబంధించిన డీడీలను శుక్రవారం తిరుమలలోని టీటీడీ ఈవో కార్యాలయంలో ఈవో ముద్దాడ రవిచంద్రకు డా. కోడెల శివరాం కృష్ణ అందజేశారు.
పేదలకు వైద్య సహాయం అందించేందుకు టీటీడీ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమానికి విరాళం అందించిన కోడెల కుటుంబాన్ని ఈవో అభినందించారు. భక్తులు, దాతలు టీటీడీ చేపడుతున్న సేవా కార్యక్రమాలకు మరింతగా సహకరించాలని ఆయన కోరారు.

