ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ17, నవంబర్ 2026, మంగళవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు!

ప్రలోభాలు, రెచ్చగొట్టే ప్రసంగాలకు తావులేదు... ర్యాలీలు, సభలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి... కృష్ణాజిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెచ్చరిక...

V10TV న్యూస్ డెస్క్ 14 నవంబర్, 2026 7:52 PMకి 7,525 వీక్షణలు
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

పెనమలూరు, నవంబర్ 14 : కృష్ణాజిల్లాలో జరగనున్న మున్సిపల్, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు. తాడిగడప, గుడివాడ మున్సిపాలిటీలతో పాటు మూడు విడతల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. శనివారం పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించే ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలకు పోలీస్, రెవెన్యూ అధికారుల నుంచి ముందస్తు అనుమతులు పొందాలని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఓటర్లను డబ్బు, మద్యం, కానుకలతో ప్రలోభపెట్టడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని హెచ్చరించారు. కులమత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం, ప్రత్యర్థి పార్టీల జెండాలు, పోస్టర్లను తొలగించడం, ధ్వంసం చేయడం వంటి చర్యలను సహించబోమన్నారు. నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థితో పాటు ముగ్గురికి మించి రావద్దని సూచించారు. లౌడ్ స్పీకర్ల వినియోగంలో నిర్ణీత సమయాలు, శబ్ద నియంత్రణ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఓటరు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు వేయగలిగే వాతావరణాన్ని కల్పిస్తామని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రశాంత నిర్వహణకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు సహకరించాలని కోరారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

అభివృద్ధికి పట్టం కట్టిన ప్రజలు!

4 గంటల క్రితం 6,984

అమిత్ షా పర్యటన వేళ.. డ్రోన్లకు నో ఎంట్రీ!

6 గంటల క్రితం 7,166

చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం!

6 గంటల క్రితం 6,483

కార్తీక దీపాల వెలుగులో శివాలయాల శోభ!

7 గంటల క్రితం 7,288