ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

ట్రిపుల్ ఇంజన్ సర్కార్‌తో అభివృద్ధి పరుగులు: ఎమ్మెల్యే గద్దె

20వ డివిజన్‌లో టీడీపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్… స్థానిక సంస్థల్లోనూ కూటమి గెలిస్తే సంక్షేమ పథకాల అమలుకు మరింత ఊతం… ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ కార్యాలయాలు కేంద్ర బిందువులుగా నిలవాలి…

V10TV న్యూస్ డెస్క్ 11 అక్టోబర్, 2026 4:32 PMకి 3,700 వీక్షణలు
ట్రిపుల్ ఇంజన్ సర్కార్‌తో అభివృద్ధి పరుగులు: ఎమ్మెల్యే గద్దె — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 11: కేంద్రం, రాష్ట్రంతో పాటు స్థానిక సంస్థల్లోనూ కూటమి అధికారంలో ఉంటే ట్రిపుల్ ఇంజన్ సర్కార్‌తో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత వేగవంతమవుతాయని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. ఆదివారం 20వ డివిజన్ నెహ్రూనగర్ మొదటి రోడ్డులోని కల్యాణ మండపం సమీపంలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ నూతన డివిజన్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం 100 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పార్టీ కార్యాలయాలు ప్రజా సమస్యల పరిష్కారానికి కేంద్ర బిందువులుగా పనిచేయాలని సూచించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తొలి ఇంజన్‌గా, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండో ఇంజన్‌గా పనిచేస్తున్నాయని, స్థానిక సంస్థల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తే మూడో ఇంజన్ తోడవుతుందని వివరించారు. తద్వారా అభివృద్ధి పనులతోపాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. రేషన్ దుకాణాల ద్వారా అందిస్తున్న బియ్యాన్ని కార్డుదారులు సద్వినియోగం చేసుకోవాలని, వాటిని విక్రయించడం ద్వారా బ్లాక్ మార్కెటింగ్‌ను ప్రోత్సహించవద్దని సూచించారు.టీడీపీ నాయకుడు గల్లా శ్రీను మాట్లాడుతూ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ముమ్మనేని ప్రసాద్, వెంకటేశ్వరరావు, లక్ష్మి, కొక్కిరి తిరుపతయ్య, పెద్ది అన్నారావు, మైలమూరు పిరుబాబు, రాయి రంగమ్మ, సింగంశెట్టి రమేష్, గోగుల ఏసుబాబు, బుజ్జమ్మ, వేములపల్లి భవాని, గల్లా రవి తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

డిసెంబర్‌ నుంచి ధరల మోత?

18 నిమిషాల క్రితం 3,897

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

2 గంటల క్రితం 3,494

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

2 గంటల క్రితం 3,784

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

2 గంటల క్రితం 4,901