ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ12, ఆగస్టు 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

గణేష్ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తాం: హోంమంత్రి అనిత

గతేడాది మాదిరిగానే ఈసారి ఉత్సవాలకు ప్రభుత్వ సహకారం సింగిల్ విండో విధానంలో అనుమతులు, ఉచిత విద్యుత్ కల్పించాలని వినతి నిమజ్జన ప్రాంతాల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ

V10TV న్యూస్ డెస్క్ 12 ఆగస్టు, 2026 6:58 PMకి 2 వీక్షణలు
గణేష్ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తాం: హోంమంత్రి అనిత — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ: గణేష్ ఉత్సవాలను గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత హామీ ఇచ్చారు. బుధవారం గోకరాజు గంగరాజు ఆధ్వర్యంలోని గణేష్ ఉత్సవ సమితి సభ్యులు హోంమంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. గణేష్ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి వివిధ శాఖల నుంచి అనుమతులు పొందడంలో ఇబ్బందులు లేకుండా సింగిల్ విండో విధానంలో అనుమతులు మంజూరు చేయాలని సమితి సభ్యులు కోరారు. అలాగే ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించడంతో పాటు నిమజ్జన ప్రాంతాల్లో అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. భక్తులు, ఉత్సవ కమిటీలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని హోంమంత్రి పేర్కొన్నారు. గత ఏడాది తరహాలోనే ఈసారి కూడా గణేష్ ఉత్సవాలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని సమితి సభ్యులకు హామీ ఇచ్చారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

తిరంగ ర్యాలీలో పాల్గొన్న బుద్ధా వెంకన్న

1 గంట క్రితం 1

54వ డివిజన్‌లో ఇంటింటికీ టీడీపీ ప్రచారం పూర్తి

1 గంట క్రితం 2

డ్రగ్స్ వద్దు బ్రో.. ఆరోగ్యం ముద్దు బ్రో

1 గంట క్రితం 1

విద్యా హక్కుల కోసం మరో స్వాతంత్ర్య పోరాటానికి సిద్ధం కావాలి: ఏఐఎస్ఎఫ్

1 గంట క్రితం 1