ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ17, ఆగస్టు 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

అమరావతి నిర్మాణానికి రూ.41,187.70 కోట్ల రుణ సమీకరణ

119 ప్రధాన మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో 97 పనులు ప్రారంభం... ఇప్పటివరకు రూ.12,731.13 కోట్లు ఖర్చు చేశామన్న మంత్రి నారాయణ... 30,173 మంది రైతులకు 71,299 రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు...

V10TV న్యూస్ డెస్క్ 17 ఆగస్టు, 2026 1:41 PMకి 1 వీక్షణలు
అమరావతి నిర్మాణానికి రూ.41,187.70 కోట్ల రుణ సమీకరణ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

అమరావతి, ఆగస్టు 17 (V10TV AP): రాజధాని అమరావతి నిర్మాణ పనులకు రూ.41,187.70 కోట్ల మేర రుణ సమీకరణ చేపట్టినట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అడిగిన పలు ప్రశ్నలకు అసెంబ్లీలో మంత్రి సమాధానమిచ్చారు.

రాజధాని అమరావతిలో మొత్తం 119 ప్రధాన మౌలిక వసతుల ప్రాజెక్టులు ఉండగా, వాటిలో 97 పనులు ప్రారంభమైనట్లు మంత్రి తెలిపారు. నాలుగు ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయని వెల్లడించారు. అమరావతి నిర్మాణానికి రూ.41,187.70 కోట్ల రుణాన్ని సమీకరించగా, ఇప్పటివరకు రూ.12,731.13 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు.

రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు సంబంధించిన వివరాలను కూడా మంత్రి సభకు వెల్లడించారు. మొత్తం 30,173 మంది రైతులకు 71,299 రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించినట్లు తెలిపారు. అమరావతిలో మౌలిక వసతుల పనులను వేగంగా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

సైబర్ నేరగాళ్ల వలలో పడకండి: ఏసీపీ దామోదర్

16 నిమిషాల క్రితం 1

గన్నవరంలో ఆగస్టు 19న మెగా జాబ్ మేళా

32 నిమిషాల క్రితం 0

విజయవాడలో జూనియర్ డాక్టర్ల సమ్మె ఉధృతం

1 గంట క్రితం 1,699

ఎంతో మందికి జీవం పోశాడు.. అవార్డు అందుకున్న 24 గంటల్లోనే కన్నుమూత

2 గంటల క్రితం 2,235