45వ డివిజన్లో ‘పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా’
ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ – ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన – ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన పేరం సత్యనారాయణ

విజయవాడ, సెప్టెంబర్ 1: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 45వ డివిజన్లో మంగళవారం ‘పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ బుద్ధా వెంకన్న ఆదేశాల మేరకు నాయకులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షుడు పేరం సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి నెలా మొదటి తేదీనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను సకాలంలో అందిస్తూ పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్దకే పెన్షన్ అందించడం ప్రజాపాలనకు నిదర్శనమన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, చదువుకునే ప్రతి బిడ్డకు ప్రయోజనం కలిగించే ‘తల్లికి వందనం’, అన్న క్యాంటీన్లతోపాటు కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను లబ్ధిదారులకు వివరించినట్లు చెప్పారు. కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని, నియోజకవర్గ ఐటీడీపీ ఉపాధ్యక్షుడు గౌరీ ఎన్. రెడ్డి, బూత్ కన్వీనర్లు తుడుము అనిల్ కుమార్, పల్లకిల అప్పారావు, అబ్రహం, చంద్రశేఖర్, మహిళా నాయకులు శాంతి, దేవు సుదర్శని తదితరులు పాల్గొన్నారు.

