ఆకలి తీర్చడమే అసలైన మానవత్వం!
పైపుల రోడ్డులో డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం... పేదలకు అన్నసంతర్పణ చేసి సేవాభావాన్ని చాటుకున్న నిర్వాహకులు... ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడమే గొప్ప సేవ అంటూ అభినందనలు...

విజయవాడ, నవంబర్ 6 : ఆకలితో ఉన్నవారి కడుపు నింపడమే నిజమైన మానవ సేవ అని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు. విజయవాడ పైపుల రోడ్డులో డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పేదలకు అన్నసంతర్పణ చేశారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వయంగా పేదలకు భోజనం వడ్డించడం ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడినవారిని ఆదుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా భావించాలని పేర్కొన్నారు. ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెట్టడంలో లభించే ఆనందం మరెందులోనూ ఉండదని, డొక్కా సీతమ్మ సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. సేవాభావంతో ముందుకు వస్తున్న ట్రస్ట్ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. మానవ సేవే మాధవ సేవ.. అన్నదానమే మహాదానం అనే స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగాలని ఆకాంక్షించారు.

