కార్పొరేటర్ ఝాన్సీకి శానిటేషన్ సిబ్బంది సత్కారం
86వ డివిజన్ కార్పొరేటర్‌కు ఘన అభినందనలు… పుష్పగుచ్ఛాలు, శాలువలతో సత్కరించిన సిబ్బంది… డివిజన్ అభివృద్ధికి సహకరించాలని కోరిన ఝాన్సీ…

పాయకాపురం, నవంబర్ 10 : విజయవాడ 86వ డివిజన్ కార్పొరేటర్ కాకొల్లు ఝాన్సీని శానిటేషన్ ఇన్స్పెక్టర్, సిబ్బంది మంగళవారం ఘనంగా సత్కరించారు. స్థానిక కార్పొరేటర్ కార్యాలయంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కె. రవికుమార్, ఆయన సతీమణి వరలక్ష్మి దంపతులను కూడా శాలువలతో సత్కరించి అభినందనలు తెలిపారు. డివిజన్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలకు సిబ్బంది సహకరించాలని కార్పొరేటర్ ఝాన్సీ కోరారు.

