నిరుపేదల వైద్యానికి రూ.16.16 లక్షల భరోసా
ముగ్గురు బాధితులకు ఎల్ఓసీ పత్రాల అందజేత ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో వైద్య చికిత్సకు ఆర్థిక సాయం భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో బాధితులకు పత్రాలు అందించిన కూటమి నేతలు

విజయవాడ, ఆగస్టు 25: నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ముగ్గురు బాధితులకు మొత్తం రూ.16.16 లక్షల విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసీ) పత్రాలు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే ఆదేశాలతో భవానిపురంలోని ఎన్డీఏ కార్యాలయంలో మంగళవారం 40వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు పీవీ చిన సుబ్బయ్య, టీడీపీ నాయకుడు మన్నెం నారాయణ, కూటమి నేతలు బాధితులకు ఎల్ఓసీ పత్రాలను అందజేశారు. చిట్టినగర్‌కు చెందిన బీ. శ్రీనివాసరావు (58) హృద్రోగంతో బాధపడుతూ వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసుకోగా రూ.8.63 లక్షల విలువైన ఎల్ఓసీ మంజూరైంది. 40వ డివిజన్ ఆర్టీసీ వర్క్‌షాప్ రోడ్డులోని దేవరాజుగట్టుకు చెందిన అంకయ్య (56) హృద్రోగ చికిత్స కోసం వైద్య సహాయం కోరగా రూ.3.61 లక్షల ఎల్ఓసీ మంజూరు చేశారు. కొత్తపేటకు చెందిన కొయ్య రాము (49) కాలికి గాయమై చికిత్స కోసం దరఖాస్తు చేసుకోగా రూ.3.92 లక్షల విలువైన ఎల్ఓసీ మంజూరైంది. ముగ్గురికీ కలిపి మొత్తం రూ.16.16 లక్షల వైద్య సహాయం అందినట్లు కూటమి నేతలు తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఖరీదైన వైద్యం భారంగా మారకుండా అవసరమైన వారికి వైద్య సహాయం అందించేందుకు ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. తమ విజ్ఞప్తులపై త్వరితగతిన స్పందించి వైద్య చికిత్సకు అవసరమైన ఎల్ఓసీలను మంజూరు చేయించిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి బాధితులు, వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

