ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ9, ఆగస్టు 2026, ఆదివారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

మైనర్ బాలికలపై లైంగిక దాడి కలకలం

ఇద్దరు ఆటో డ్రైవర్లపై తీవ్ర ఆరోపణలు... నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్లు ఫిర్యాదు... ఎస్పీ ఆదేశాలతో పెడన, బందరు రూరల్ పోలీసుల ముమ్మర దర్యాప్తు...

V10TV న్యూస్ డెస్క్ 9 ఆగస్టు, 2026 8:52 AMకి 8 వీక్షణలు
మైనర్ బాలికలపై లైంగిక దాడి కలకలం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

క్రైమ్ న్యూస్ – కృష్ణా: మచిలీపట్నం పరిధిలో ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక దాడి జరిగినట్లు వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపింది. పెడన మండలంలోని ఓ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు ఈ నెల 6న పాఠశాల నుంచి మచిలీపట్నం వచ్చినట్లు సమాచారం. బాలికలు తమకు పరిచయమున్న వ్యక్తికి ఫోన్ చేయడంతో అతడు మరో వ్యక్తితో కలిసి ఆటోలో కోనేరు సెంటర్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం బాలికలను ఆటోలో ఎక్కించుకుని రుద్రవరం ప్రాంతంలోని నిర్మానుషంగా ఉన్న టిడ్కో గృహాల వద్దకు తీసుకెళ్లి ఇద్దరూ లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరుసటి రోజు బాలికల్లో ఒకరు అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. దీంతో జరిగిన విషయాన్ని బాలిక వెల్లడించినట్లు సమాచారం. వెంటనే కుటుంబ సభ్యులు పెడన పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై పెడన, బందరు రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు. కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను నిర్ధారించేందుకు దర్యాప్తును వేగవంతం చేసినట్లు సమాచారం. బాధిత బాలికల గోప్యతకు భంగం కలగకుండా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

విజయ పాల ధరలు పెంపు.. రేపటి నుంచే అమలు

2 గంటల క్రితం 125

కార్పొరేషన్ ఎన్నికల్లో క్లీన్‌స్వీపే లక్ష్యం

3 గంటల క్రితం 223

కానుమోలు అభివృద్ధికి మరో రూ.2.20 కోట్లు

3 గంటల క్రితం 186

ఆటో డ్రైవర్లకు ‘ఏపీ అస్త్రం’ యాప్‌పై అవగాహన

12 గంటల క్రితం 1,654