ఆటో డ్రైవర్లకు ‘ఏపీ అస్త్రం’ యాప్‌పై అవగాహన
కండ్రిక జంక్షన్లో అజిత్‌సింగ్‌నగర్ ట్రాఫిక్ పోలీసుల కార్యక్రమం... రోడ్డు భద్రతపై ఆటో డ్రైవర్లతో ప్రతిజ్ఞ...

విజయవాడ ఆగస్టు 8 (వీ20టీవీ): మహిళలు, ప్రయాణికుల భద్రతకు ఉపయోగపడే ‘ఏపీ అస్త్రం’ యాప్ వినియోగంపై అజిత్‌సింగ్‌నగర్ ట్రాఫిక్ పోలీసులు ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ ప్రభాకర్ మాట్లాడుతూ, ఆటో డ్రైవర్లు నిత్యం ప్రజలతో మమేకమై ఉండే రవాణా వ్యవస్థలో కీలక భాగస్వాములని అన్నారు. ప్రయాణికులు, ముఖ్యంగా మహిళల భద్రతకు ‘ఏపీ అస్త్రం’ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, యాప్ వినియోగంపై ప్రతి ఆటో డ్రైవర్ అవగాహన పెంచుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మరింత భద్రత కల్పించవచ్చని పేర్కొన్నారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రయాణికుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రమాదాల నివారణలో పోలీసులకు సహకరించాలని కోరారు.అనంతరం ఎస్సై కృష్ణ, పోలీసు సిబ్బందితో కలిసి ఆటో డ్రైవర్లతో రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ తమతో పాటు ప్రయాణికుల ప్రాణాలను కాపాడతామని ఆటో డ్రైవర్లు ప్రతిజ్ఞ చేశారు.

