ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ17, ఆగస్టు 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

మంచితనానికి మారుపేరు సీతా మహాలక్ష్మి

మందడం గ్రామంలో ఘనంగా 11వ రోజు వర్ధంతి కార్యక్రమం.. కుటుంబానికే కాదు.. గ్రామానికీ ఆప్యాయత పంచిన ఆదర్శమూర్తిగా పలువురి నివాళి.. చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించిన ప్రముఖులు, బంధుమిత్రులు..

V10TV న్యూస్ డెస్క్ 17 ఆగస్టు, 2026 8:37 PMకి 1,635 వీక్షణలు
మంచితనానికి మారుపేరు సీతా మహాలక్ష్మి — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

గుంటూరు, ఆగస్టు 17 (V10TV AP): గుంటూరు జిల్లా మందడం గ్రామంలో వట్టికూటి సీతా మహాలక్ష్మి 11వ రోజు వర్ధంతి కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, గ్రామస్తులు కార్యక్రమానికి హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

సీతా మహాలక్ష్మి తన జీవితకాలంలో కుటుంబాన్ని ప్రేమానురాగాలతో నడిపించడంతో పాటు చుట్టుపక్కల వారితో ఎంతో ఆప్యాయంగా మెలుగుతూ మంచి పేరు సంపాదించుకున్నారని పలువురు గుర్తు చేసుకున్నారు. దివంగత భర్త వట్టికూటి సూర్యనారాయణరావుతో కలిసి మందడం గ్రామంలో గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకున్నారని పేర్కొన్నారు. కష్టసుఖాల్లో తమవారికి అండగా నిలవడం, ఇంటికి వచ్చిన వారిని ఆదరించడం, బంధుత్వాలకు విలువనివ్వడం ఆమె ప్రత్యేకతగా కొనియాడారు.

ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలతో కూడిన కుటుంబాన్ని ప్రేమ, క్రమశిక్షణ, సంస్కారాలతో తీర్చిదిద్దిన మాతృమూర్తిగా ఆమెను కుటుంబ సభ్యులు స్మరించుకున్నారు. ఆమె భౌతికంగా దూరమైనా.. కుటుంబానికి అందించిన సంస్కారం, గ్రామంలో సంపాదించుకున్న మంచి పేరు చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ సీతా మహాలక్ష్మి అందరినీ కలుపుకొని వెళ్లే స్వభావం కలిగిన వ్యక్తి అని, ఆమె ఆప్యాయతను పొందిన వారికి ఆమె జ్ఞాపకాలు ఎప్పటికీ మధురంగానే ఉంటాయని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

వర్ధంతి కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, గ్రామ ప్రముఖులు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని “సీతా మహాలక్ష్మి జ్ఞాపకం మా హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది” అంటూ నివాళులర్పించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

పసిబిడ్డకు పునర్జన్మ.. ‘జెస్సిక శ్రీ’గా పేరు పెట్టిన కమిషనర్

4 గంటల క్రితం 1

మెగా డీఎస్సీపై కుట్రలు పనిచేయవు: సీఎం చంద్రబాబు

4 గంటల క్రితం 1,589

ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు భక్తుల మృతి

4 గంటల క్రితం 1,372

సైబర్ నేరగాళ్ల వలలో పడకండి: ఏసీపీ దామోదర్

8 గంటల క్రితం 5,254