కూటమి నుంచి వైసీపీ గూటికి.. మహిళా నేతల చేరికలు!
55వ డివిజన్‌కు చెందిన బీజేపీ, టీడీపీ మహిళా నాయకులు వైసీపీలో చేరిక… మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్న నేతలు… స్థానిక సంస్థల ఎన్నికల వేళ విజయవాడ పశ్చిమలో రాజకీయ సందడి…

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయ చేరికలు కొనసాగుతున్నాయి. విజయవాడ బ్రాహ్మణ వీధిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సమక్షంలో 55వ డివిజన్‌కు చెందిన బీజేపీ, టీడీపీ మహిళా నాయకులు వైసీపీలో చేరారు. వనుమంద, అస్మతునిస్సా, షేక్ ఫర్జానా, ఖాజాబీ, ముంతాజ్ తదితరులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారికి మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా చేరిన మహిళా నాయకులు అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న తరుణంలో వివిధ పార్టీల నుంచి నాయకులు వైసీపీలో చేరడం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు కృషి చేస్తున్నారు.

